Nojoto: Largest Storytelling Platform

బ్రతుకు ఇంట అందాలను వేయడమే రంగవల్లి.!! చిరునవ్వుల

బ్రతుకు ఇంట అందాలను వేయడమే రంగవల్లి.!!
చిరునవ్వుల తారలతో మెరవడమే రంగవల్లి.!!

చుక్కలెంత దూరమున్న నేలపైన సంక్రాంతికి
చిక్కు చిక్కు సమస్యలను గెలవడమే రంగవల్లి.!!

ఈ లోకం వాకిట్లో నీ అడుగుల శోభ చూపు
ముచ్చటగా స్పూర్తి ముగ్గు నిలపడమే రంగవల్లి.!!

మనసు నింగి ఇంద్రధనుసు తలపులతో విరిసిందా?
మధుర భావ రంగులతో కలవడమే రంగవల్లి.!!

దుఃఖాలను శిశిరాలే శాంతి రాల్చె వన్నెల్లో
నీ చేతల వసంతాలు తెలుపడమే రంగవల్లి.!! #వన్నెలయ్య_గజల్ 201 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్