Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_కలం Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_కలం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 75 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #దీపావళి #దీపం #దీపావళిశుభాకాంక్షలు

read more
చికటి తెరలను
చుట్టిన పథమున
మెరిసే దివ్వెలు వెలిగిద్దాం.!

దుఃఖపు వాగులు
పొరలిన మనసున
మురిసె నవ్వులు పూయిద్దాం.!

సాగే అడుగులు
ఆగిన దినమున
ఆడే మువ్వలు చూపిద్దాం! #వన్నెలయ్య_కలం  #దీపావళి #దీపం #దీపావళిశుభాకాంక్షలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #కలం #కలంఅంటే #ప్రహేళిక

read more
పదాలు పరిచయమే
వికసించిన ఈ భావమే
నూతనంగా పరిమళిస్తుంది!

రాగము ఆనాదిగా తెలిసిందే
విప్లవ కేతన గీతమే
ఆధునాతన చేతన నింపింది!

కలం కాలంలో ఎప్పుడూ ఉన్నదే
కవితాక్షర విన్యాసమే..
విద్యుల్లతా కాంతి కిరణమయ్యింది! #వన్నెలయ్య_కలం #కలం #కలంఅంటే #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం

read more
పరుగున వచ్చి వెదురు గుండెలో గాయం చేసిందెవరు.!?
గుండె రంధ్రముల ఒత్తిడులెన్నో గేయం చేసిందెవరు.!? #వన్నెలయ్య_కలం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #సమస్యాపూరణ131 #ఇష్టంకష్టం #ప్రేమ #శృంగారం #వలపు #తమకం #erotica

read more
అసలే వేసవి కాలం
ఆరుబయట నులక మంచం పై శయనం
చల్లటి పిల్ల తెమ్మెర అటూ ఇటూ వీస్తూ
కొంటెగా తాకి పులకరిస్తుంది
తారా లోకం అంతా తొంగి చూస్తుంటే..

మారుడు సృష్టించిన శర పవన ఘాతాలకు
.....మోహ మేఘాలు కదిలి కురిసి
.....వలపుల అలలు రగిలి ఎగసి
.....తమకపు తొణుకులు విరిసి నడిచి
.....అహరహం విరహ సుడిగుండాలు చుట్టు ముట్టి
పెదవుల మధువుల బంధంలో.....
నిరవధిక శృంగార సంద్రంలో.....
.....ఏకాంతంగా
.....ఘోరాతి ఘోరంగా
వారిద్దరు.....
మునిగిపోయారు....
..... ఆశ్చర్యంగా
.....ఆనందంగా

"ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ" -భ.గీ 07/11 #వన్నెలయ్య_కలం
#సమస్యాపూరణ131 
#ఇష్టంకష్టం 
#ప్రేమ
#శృంగారం
#వలపు
#తమకం
#erotica

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #సమస్యాపూరణ131 #ఇష్టంకష్టం #ప్రేమ #శృంగారం #వలపు #తమకం #erotica

read more
అసలే వేసవి కాలం
మేడ మీద నులక మంచం పై శయనం
చల్లటి పిల్ల తెమ్మెర అటూ ఇటూ వీస్తూ
కొంటెగా తాకి పులకరిస్తుంది
తారా లోకం అంతా తొంగి చూస్తుంటే..

నింగి వైపు ఆ జంట చూస్తూ
చూపుడు వేలితో కవిత్వం వ్రాసుకుంది..
తారల చమకుల వెలుగులే
తొలి రాత్రికి మల్లె పందిరనీ.!
అస్పష్టతకు సంతకమైన చీకటే
మనల్ని కలిపే వారధనీ.!
కలువల చలువల చంద్రుడే
మన శయనం పక్కన లాంతరనీ.!
రాలిపడే తోక చుక్కలు
మదన క్రీడకు పురిగొల్పే పూవులనీ.!
కబర్లాడుతుండగా..
తూరుపింట దీపం వెలిగిపోయింది.

"శృంగార ఏవ ఏకో రస:" #వన్నెలయ్య_కలం
#సమస్యాపూరణ131
#ఇష్టంకష్టం
#ప్రేమ
#శృంగారం
#వలపు
#తమకం
#erotica

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #సమస్యాపూరణ131 #ఇష్టంకష్టం #ప్రేమ #శృంగారం #వలపు #తమకం #erotica

read more
అసలే వేసవి కాలం
మేడ మీద నులక మంచం పై శయనం
చల్లటి పిల్ల తెమ్మెర అటూ ఇటూ వీస్తూ
కొంటెగా తాకి పులకరిస్తుంది
తారా లోకం అంతా తొంగి చూస్తుంటే..

ఎంత పని జరిగిపోయింది
రేండు తను లతలు
పిల్ల గాలి అల్లరి పనికి ఘోరంగా గాయపడ్డాయి.
తపనల అలికిడిలో..
తమకపు ఉప్పెనలో..
మనసులు తప్పిపోయి
ప్రియుడి చూపులో..
వలపు జాతరలో..
మనుషులు కలిసిపోయారు
లోకం శూన్యంగా
తాపం స్వర్గంగా
ద్వైతం అద్వైతంగా
మొత్తానికి అలా గుచ్చుకుంది
తొలి సారి ఆ యదలపై
పచ్చ విల్తుడి చెరుకు విల్లుల తీయని ఆమని
అదేనండీ మన్మధ వసంతం.!

'ప్రజనశ్చాస్మి కందర్ప' -భ.గీ 10/28 #వన్నెలయ్య_కలం
#సమస్యాపూరణ131
#ఇష్టంకష్టం
#ప్రేమ
#శృంగారం
#వలపు
#తమకం
#erotica

Naresh Reddy Aleti

#హోళి #వన్నెలయ్య_పండగ #వన్నెలయ్య_కలం

read more
వేసారిన గుండెల్లో
వేడెక్కిన గమనంలో
హోళీ...
చిరు చినుకుల మేఘమాల!

నిశి ముసిరిన బ్రతుకుల్లో
శశి పూయని దారుల్లో
హోళీ..
రంగు రంగుల పూలమాల!

భిన్నత్వపు తలపుల్లో
విచ్ఛిన్నపు చూపుల్లో
హోళీ..
సమైక్యతాక్షరమాల! #హోళి #వన్నెలయ్య_పండగ #వన్నెలయ్య_కలం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #ప్రేమ

read more
అతను విడిచి వెళ్ళినా
కాలం ముందుకెళ్ళినా
      ఆమె మాత్రం అక్కడే
.................కదలకుండా!

వయసు కరుగుతున్నా
జగము మారుతున్నా
      ఆమె మనసులో అతడే
.................వీడకుండా!

వలపులు వేదిస్తున్నా
తలపులు పిలుపిస్తున్నా
      ఆమె ఆశలు శూన్యమే
.................వెలుగకుండా! #వన్నెలయ్య_కలం #ప్రేమ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #నాకవిత #నాకవిత్వశైలి

read more
గజ్జ కట్టి ఆడినట్టు..
గల్లు గల్లు మోగినట్టు..
          భావ లహరి నాట్యమాడు.!

కడలి అలల హోరు అయ్యి..
అడవి రాజు జోరు అయ్యి..
          పదాలన్ని పరుగు తీయు.!

మరలి పోని శోభ వలే..
మరపు రాని వనిత వలే..
          నాదు కవిత రూపు చూడు.! #వన్నెలయ్య_కలం #నాకవిత #నాకవిత్వశైలి

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #బాలలదినోత్సవం #వన్నెలయ్య_బాల_కవితలు #వన్నెలయ్య_బాల_గేయం #బాలలు #పిల్లలు

read more
అనంత విశ్వపు అంచుల వరకు..
ఎగిరే ఆశల రెక్కలు వారే.!
విరించి సృష్టిని వింతగ కడకు..
రోజూ ఆటకు మలిచెను వారే.!

వడి వడి అడుగుల సడులే చేస్తూ..
వసుధ ముద్దుల తనయులు వారే.!
చెట్టు కొమ్మల స్నేహం చేస్తూ..
ప్రకృతి ప్రేమల చూడ్కులు వారే.!

ఆగని పరుగుల అల్లరి చేసీ..
పాషాణాలను కరిగిస్తారే.!
వెతికిన దొరకరు గోడకు దాగీ..
అమృత సుధలను కురిపిస్తారే.!

నోటికి వచ్చే పలుకే పద్యం..
గిన్నే గరిటా కాదా వాద్యం.!
బాలల ఆటలు ఎవరికి సాధ్యం..
వన్నెల చూడక తప్పదు చోద్యం.!

"అమృతం బాల భాషితం" #వన్నెలయ్య_కలం #బాలలదినోత్సవం #వన్నెలయ్య_బాల_కవితలు #వన్నెలయ్య_బాల_గేయం #బాలలు #పిల్లలు
loader
Home
Explore
Events
Notification
Profile