Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 15 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_స్వేచ్ఛా_హైకులు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #ఉత్తరం

read more
1
సరిహద్దుల్లో
ప్రియుడి మనసు..
ఇప్పుడు చేతిలో!
2
గుండె బరువెంతో
మోసుకెలుతుంటే ఉత్తరం.
ఇక హాయిగా,
3
కన్నీరు
కన్నుల నిండా..
ఎం చెప్పిందో ఉత్తరం!
4
పాత ఉత్తరం
తీపి విడవని అక్షరం..
మళ్ళీ పంచింది!
5
తంతి డబ్బ
ఇప్పుడు అనాధ..
చరవాణిలో లోకం!
6
ధైర్యంగా చెప్పలేక
ఐ లవ్ యు...
ఉత్తరం రాసా!

రచన: నరేశ్ ఏలేటి #వన్నెలయ్య_స్వేచ్ఛా_హైకులు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు  #ఉత్తరం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ

read more
పెత్తందార్లను ప్రశ్నించి
దొరలందరిని నిలదీసె
అన్యాయాలు నిరసించి
ఉద్యమాలను సృష్టించె
వారెవ్వా! తెలంగాణ
తిరగబడిన ఖార్కాన #వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ

Naresh Reddy Aleti

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ #వన్నెలయ్య_కైతికాలు

read more
నేలంతా తమదంటే
ఎదురించే పిడికిళ్లవి
అడుగు కదప రాదంటే
ఎర్రబడ్డ కన్నులవి
వారెవ్వా! అమరులార
నిప్పు కణిక గుండెలార తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
#వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ #వన్నెలయ్య_కైతికాలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #ఓజోన్_పొర #ozoneday #Ozone #ozonelayer

read more
చాపగ తన దేహం
అంతటా పరిచింది
ప్రచండ రవి కిరణం
రోజు వడబోసింది
వారెవ్వా! ఓజోన్ పొర
జీవ జాతి గొడుగు కదా #వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #ఓజోన్_పొర #ozoneday #ozone #ozonelayer

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 123 #గజల్ #గజల్స్ #టీ #ATteaspecial #InternationalTeaDay #Tea #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు గతంలో కాఫీ పై గజల్ వ్రాసినప్పుడు టీ పైన కూడా వ్రాయాలనుకున్న ఈరోజు కుదిరింది..

read more
నిదరమబ్బు ఇంకెక్కడ అందుకుంటె ఒక్క చాయి
నీరసాల జాడెక్కడ పొందుతుంటె ఒక్క చాయి

మధు రసముల కన్న తీపి ఇలలోనా అందెనుగా
నవ రసముల రుచులేలా ముందరుంటె ఒక్క చాయి

సువాసనలు ఎన్నెన్నో జగతిలోన మత్తు పంచె
ఘుమ ఘుమలతొ మత్తు చిత్తు తాగుతుంటె ఒక్క చాయి

దుస్తులెన్ని కప్పుకున్న పుట్టలేని వెచ్చధనం
చలిగిలిలో వాడి వేడి వెంటుంటే ఒక్క చాయి

ఒత్తిడితో చిత్తడయ్యె చిత్తానికి శాంతి నిస్తె
వన్నెలయ్య కోరుతాడు చక్కగుంటె ఒక్క చాయి #వన్నెలయ్య_గజల్ 123
#గజల్ #గజల్స్ #టీ #ATteaspecial #InternationalTeaDay #Tea #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు
గతంలో కాఫీ పై గజల్ వ్రాసినప్పుడు టీ పైన కూడా వ్రాయాలనుకున్న ఈరోజు కుదిరింది..

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 116 #వన్నెలయ్య_అమ్మ #గజల్ #అమ్మ #మాతృదినోత్సవం శుభాకాంక్షలు💐💐💐🌷🌷🌷 #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు అమ్మ అంటే ప్రేమ అమ్మ అంటే శ్రమ అమ్మ అంటే ఓపిక అమ్మ అంటే దయ #amma #వన్నెలయ్య_స్మృతి

read more
అనవరతం మా కోసం కదిలినావు ఓ జననీ
నిరంతరం మా క్షేమం తలచినావు ఓ జననీ

నువ్వొంపిన ఘర్మజలం నేలతల్లి కభిషేకం
మా కోసం తోటపనిలొ కరిగినావు ఓ జననీ

నాన్నకేమి చెప్పలేని నా కోరిక లెన్నెన్నో
నీ చెవితో పంచుకుంటె తీర్చినావు ఓ జననీ

భారములను తుడిచేయగ హారములను అమ్మినావు
గండాలను దాంటించి గెలిచినావు ఓ జననీ

వన్నెలోన్ని మలిచినట్టి మాతృమూర్తి వందనమే
నా కన్నుల దేవతవై వెలిగినావు ఓ జననీ #వన్నెలయ్య_గజల్ 116
#వన్నెలయ్య_అమ్మ
#గజల్ #అమ్మ #మాతృదినోత్సవం శుభాకాంక్షలు💐💐💐🌷🌷🌷  #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు

అమ్మ అంటే ప్రేమ
అమ్మ అంటే శ్రమ
అమ్మ అంటే ఓపిక
అమ్మ అంటే దయ

Naresh Reddy Aleti

#bmworldwaterday World Water Day is held annually on 22 March as a means of focusing attention on the importance of freshwater and advocating for the sustainable management of freshwater resources. This Day is an opportunity to learn more about water related issues, be inspired to tell others and take action to make a difference. Water is an essential building block of life. It is more than just essential to quench thirst or protect health; water is vital for creating jobs and supporting econom #yqbaba #Collab #వన్నెలయ్య_కలం #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు

read more

అవనికి పచ్చని చీరను కట్టే
పారుతు కదిలి సంద్రం కలిసే

బావుల చెరువుల నిండా వెలిగే
ప్రాణుల దాహం అంతా తుడిచే

ప్రాణుల పుట్టుక యజ్ఞం నీరు
జనతకు మనుగడ రూపై పారు

జల కళ నొంపే చర్యల పూను
గల గల బాపే చేతల నాపు #bmworldwaterday

World Water Day is held annually on 22 March as a means of focusing attention on the importance of freshwater and advocating for the sustainable management of freshwater resources. This Day is an opportunity to learn more about water related issues, be inspired to tell others and take action to make a difference. Water is an essential building block of life. It is more than just essential to quench thirst or protect health; water is vital for creating jobs and supporting econom

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 45 క్షెమించాలి.. ముఖ్యంగా సుమన అక్క, ఏకవచనం తప్పలేదు. మహిళ లందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.🌷🌷 2వ శేర్లో.. 2వ పాదంలో "సునితా విలియమ్స్" NASA వ్యోమగామి ని గురించి ప్రస్తావించాను. #మహిళాదినోత్సవం #vnlmt #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #గజల్స్

read more
నాటి మహిళ ఐలమ్మా శక్తెంతో తెలియవేల
నేటి మహిళ చదువులమ్మ యుక్తెంతో తెలియవేల

సాధ్యమేమి తనకంటూ చిన్నచూపు చూస్తివేల
వీరనారి ఝాన్సిరాణి తెగువెంతో తెలియవేల

ఆడదంటు ఎగరనీక అడ్డు నిలుచు బుద్దులేల
విహంగమై కదులు సునిత ధీ'ఎంతో తెలియవేల

విధిపూజా చేయునపుడు అణిచివేయు చర్యలేల
ప్రణవమంటి సుమన మనము నీతెంతో తెలియవేల

ఉదయ కిరణ స్పర్శ తాకి మహిళ మవ్వ లాడువేళ
వన్నెలయ్య కలమంచున శోభెంతో తెలియవేల #వన్నెలయ్య_గజల్ 45
క్షెమించాలి.. ముఖ్యంగా సుమన అక్క, 
ఏకవచనం తప్పలేదు.

మహిళ లందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.🌷🌷

2వ శేర్లో.. 2వ పాదంలో "సునితా విలియమ్స్"  NASA వ్యోమగామి ని గురించి ప్రస్తావించాను.

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 38 #గజల్స్ #గజల్ #తెలుగు #మాతృభాషాదినోత్సవం #అంతర్జాతీయమాతృభాషా #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు

read more
ఆది నాద మొంపుకున్న ఓంకారం తెలుగు భాష
అమ్మ ఆవు దిద్దుకున్న శ్రీకారం తెలుగు భాష

గుండ్రంగా వొంపులున్న తెలుగు లిపి కళలు చూడు
తెలుగు వాడి నిండు మనసు ఆకారం తెలుగు భాష

పలుకులమ్మ చెట్టుకింద నేర్పంతా తెలుగు కదా
సాధించిన ఆశయాల సాకారం తెలుగు భాష

హలము కలము రెండు పట్టి తెనిగించే భాగవతం
కవి పోతన కలకండల ప్రాకారం తెలుగు భాష

తెలుగు మాట వినిపిస్తే ప్రకృతి లోను పరవశమే
కోకిలమ్మ కుహు కుహులో నుడికారం తెలుగు భాష

వన్నెలయ్య కవితాక్షర రూపానికి గుండెకాయ
కలమంతా అల్లుకున్న మమకారం తెలుగు భాష #వన్నెలయ్య_గజల్ 38
#గజల్స్ #గజల్
#తెలుగు #మాతృభాషాదినోత్సవం #అంతర్జాతీయమాతృభాషా #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 31 #వన్నెలయ్య_స్మృతి #వన్నెలయ్య_అమ్మ నాల్గవ శేర గురించి చెప్పాలనుంది.. నా చిన్నతనంలో... అప్పుడు వయసెంతో నాకు గుర్తు లేదు అమ్మ పొలానికి వళ్తుంటే ఏడ్చేవాన్ని. ఏదో బలం కోల్పోతున్నట్టుగా ఉండేది.. #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #గజల్స్

read more
మోక్ష సీమ నీపాదం విడువలేను ఓ తల్లీ
నిన్ను మించి ఏదైవం కొలువలేను ఓ తల్లీ

ప్రతిమాట సుమభావం మొలకలేయు నీనోట
ఏ కవితా నిన్ను మించి అల్లలేను ఓ తల్లీ

సవ్వడులను ప్రతి నిమిషం చేయుచుండు నీ గాజులు
నీ కరముల కదలికలను చేరలేను ఓ తల్లీ

పంట పొలం పరిమళాలు సంజవేళ నీ ఒడిలో
నింపుకున్న నా బాల్యం మరవలేను ఓ తల్లీ

ప్రతి అడుగున ప్రేమ మొలక లేయించును నీ హృదయం
వన్నెల్లో గోదారిక చిన్నదేను ఓ తల్లీ #వన్నెలయ్య_గజల్ 31
#వన్నెలయ్య_స్మృతి
#వన్నెలయ్య_అమ్మ
నాల్గవ శేర గురించి చెప్పాలనుంది..

నా చిన్నతనంలో...
అప్పుడు వయసెంతో నాకు గుర్తు లేదు 
అమ్మ పొలానికి వళ్తుంటే ఏడ్చేవాన్ని. ఏదో బలం కోల్పోతున్నట్టుగా ఉండేది..
loader
Home
Explore
Events
Notification
Profile