Nojoto: Largest Storytelling Platform

మాటల బాకులు దింపుటె నేరం.! తక్కువ చూపులు చూచుటె నే

మాటల బాకులు దింపుటె నేరం.!
తక్కువ చూపులు చూచుటె నేరం.!

నమ్మిన జనతను కాటేస్తావా?
కుర్చీ ఆటలు ఆడుటె నేరం.!

ప్రగతిని కోరని మనుషులు ఎందుకు?
ఓటరు కోటరు త్రాగుటె నేరం.!

బల్లల క్రిందర చేతుల జోలెల
ఆశల ఊయల ఊగుటె నేరం.!

లక్ష్యం చెడిపే పలుకులవేమిటి?
ఆశయ కోటలు కూల్చుటె నేరం.!

ప్రేమను గెలిచీ పోవుట సరియా?
హృదిలో అగ్నులు రేపుటె నేరం.!

వెతికి చూడవా నీ'లో కళలే
వన్నెల వెన్నెల దాయుటె నేరం #వన్నెలయ్య_గజల్ 213
#గజల్
మాటల బాకులు దింపుటె నేరం.!
తక్కువ చూపులు చూచుటె నేరం.!

నమ్మిన జనతను కాటేస్తావా?
కుర్చీ ఆటలు ఆడుటె నేరం.!

ప్రగతిని కోరని మనుషులు ఎందుకు?
ఓటరు కోటరు త్రాగుటె నేరం.!

బల్లల క్రిందర చేతుల జోలెల
ఆశల ఊయల ఊగుటె నేరం.!

లక్ష్యం చెడిపే పలుకులవేమిటి?
ఆశయ కోటలు కూల్చుటె నేరం.!

ప్రేమను గెలిచీ పోవుట సరియా?
హృదిలో అగ్నులు రేపుటె నేరం.!

వెతికి చూడవా నీ'లో కళలే
వన్నెల వెన్నెల దాయుటె నేరం #వన్నెలయ్య_గజల్ 213
#గజల్