Nojoto: Largest Storytelling Platform

అదిగో నింగికి ఎర్రని రవియై కనిపిస్తున్నది మా ఇందూర

అదిగో నింగికి ఎర్రని రవియై కనిపిస్తున్నది మా ఇందూరు.!
ఇదిగో నిజాము ప్రభుతను దింపీ గర్జిస్తున్నది మా ఇందూరు.!

బంగరు భూములు సింగిడి రంగులు ఎన్నో ఎన్నో ఎక్కడ చూసిన
కర్షక మిత్రుల పంటల రూపై ఉదయిస్తున్నది మా ఇందూరు.!

జగమున ప్రాణుల జీవన మనుగడ పొంగుతు పారే జలమని తెలిసీ
గలగల స్వనముల త్రివేణి నదులై ప్రవయిస్తున్నది మా ఇందూరు.!

తెలుగుకు మధురిమ ఎంతో ఎక్కువ తెలంగాణలో నిజాంబాదులో
హృదయం దోచిన ఆమని పలుకై మురిపిస్తున్నది మా ఇందూరు.!

తొంబై పల్లెల సర్వం త్యాగం యస్సారెస్పీ ప్రాజెక్టేరా
వన్నెల గుండెకు జ్ఞప్తికి తెచ్చీ కదిలిస్తున్నది మా ఇందూరు.! #వన్నెలయ్య_గజల్ 281 #గజల్