దక్కన్ పీఠభూమిలోని పోరాటాల పురిటిగడ్డ, నా తెలంగాణ, బమ్మెర పోతన ప్రాణం పోసుకున్న నేల, రాణి రుద్రమ రాణించిన నేల , గోనగన్నారెడ్డి గర్జించిన నేల, పి. వి నరసింహారావు పాలించిన నేల, శక్తిపీఠాలకు మహిమగల ఆలయాలకు చారిత్రాత్మక కట్టడాలకు నిలయం నా తెలంగాణ, పోరాటం ప్రాణం పోసుకున్న నేల, విడుదలకై ఉద్యమించిన నేల, స్వాతంత్రానికై సమరశంఖం పూరించిన నేల, గెలుపు సాధనలో అలుపెరగని నేల, ఆశయసాధనలో వేలాది ఆయుష్షులు అర్ధాంతరంగా ఆగిపోయినా అడుగు తడబడని నేల, ధైర్యానికి దృశ్యరూపం నా తెలంగాణ, స్వరాష్ట్ర సాధన కోసం స్వలాభం ఎరుగని, ఎందరో నా అన్నలు అక్కలు చేసిన అలుపెరగని పోరాటం, ఆత్మదానాల ఫలితం నేడు ఈ మన ప్రతేక్య తెలంగాణ, చరిత్రలో నిలిచిన రోజు, మన భవిత బాగుపడిన రోజు, జై తెలంగాణ జై జై తెలంగాణ. #hearts #jai #telangana