Nojoto: Largest Storytelling Platform

చూస్తుండగా వెన్నెలే రాత్రై పోయింది.! హృదయం కళలే ని

చూస్తుండగా వెన్నెలే రాత్రై పోయింది.!
హృదయం కళలే నింపే పాత్రై పోయింది.!

తాగే భర్తను కుటుంబ బరువును మోస్తూ..
సహనం నింపిన ఆ అమ్మే ధాత్రై పోయింది.!

పుట్టుట చచ్చుట తప్పేదెప్పుడొ..జీవా
రాక పోకలతో ఈ జగతే యాత్రై పోయింది.!

ధరాతలం వేదికపై జీవితమే ఒక నటన
"నేనెవరో" తెలియని తనమే పాత్రై పోయింది.!

వెతలను మాయం చేసే మంత్రం ఉంటుందా?
వన్నెల కన్నుల నిదురే మాత్రై పోయింది.! #వన్నెలయ్య_గజల్ 327 #గజల్
చూస్తుండగా వెన్నెలే రాత్రై పోయింది.!
హృదయం కళలే నింపే పాత్రై పోయింది.!

తాగే భర్తను కుటుంబ బరువును మోస్తూ..
సహనం నింపిన ఆ అమ్మే ధాత్రై పోయింది.!

పుట్టుట చచ్చుట తప్పేదెప్పుడొ..జీవా
రాక పోకలతో ఈ జగతే యాత్రై పోయింది.!

ధరాతలం వేదికపై జీవితమే ఒక నటన
"నేనెవరో" తెలియని తనమే పాత్రై పోయింది.!

వెతలను మాయం చేసే మంత్రం ఉంటుందా?
వన్నెల కన్నుల నిదురే మాత్రై పోయింది.! #వన్నెలయ్య_గజల్ 327 #గజల్