"సంగీతం" అక్షరాలాన్ని ఆదమరచి ఆటలాడే అందాల ఉద్యానవనం అలసిన అక్షరాలకు లాలి పాటలతో జోల పాడుతుంది ఉవ్వెత్తున ఎగిసిపడే అక్షరాలను యదన నింపుకొని విప్లవ గేయాలనూ గర్జిస్తుంది సిగ్గు మొగ్గ వేసిన అక్షరాలని వికసింపజేసి వలపు రాగాలను రానిస్తుంది వేదనతో వాడిన అక్షరాలని ఓదార్చి విరహ గీతాలను వినిపిస్తుంది ఆదమరిచిన అక్షరాలను అందెకట్టి ఆడిస్తుంది అలవోకగా అక్షరాలకు ఆభరణమవుతుంది పొంతన కుదిరిన పదాలను కలిపే పొదరిల్లు అవుతుంది అనువాదాలను ఆధారం చేసుకొని స్వరసంపదతో సాన్నిహిత్యమయ్యే అంతులేని సంపద సంగీతమవుతుంది ©vineelasubramanyam #Music #musicday #love❤ #Music