Nojoto: Largest Storytelling Platform

అడుగుల నాపే వలయం చూడు.! ఆగక ఎదిగే కథనం చూడు.! స్ర

అడుగుల నాపే వలయం చూడు.!
ఆగక ఎదిగే కథనం చూడు.!

స్రవంతి నడకకు వొంపులు ఎన్నో
కుదుపుల నోర్చిన పయనం చూడు.!

వెలుతురు నాపుతు కొండలు బండలు
జగాన ఆగని ఉదయం చూడు.!

గూటిని కూల్చగ గాలీ వానా
చెదరని గువ్వల నిలయం చూడు.!

ఎదిగే బాటలొ ముళ్ళూ కొన్నీ
గులాబి విరిసే సమయం చూడు.!

ప్రేమిక లేదిక వన్నెల వాడికి
గరళం మ్రింగిన హృదయం చూడు.! #వన్నెలయ్య_గజల్ 259 #గజల్
అడుగుల నాపే వలయం చూడు.!
ఆగక ఎదిగే కథనం చూడు.!

స్రవంతి నడకకు వొంపులు ఎన్నో
కుదుపుల నోర్చిన పయనం చూడు.!

వెలుతురు నాపుతు కొండలు బండలు
జగాన ఆగని ఉదయం చూడు.!

గూటిని కూల్చగ గాలీ వానా
చెదరని గువ్వల నిలయం చూడు.!

ఎదిగే బాటలొ ముళ్ళూ కొన్నీ
గులాబి విరిసే సమయం చూడు.!

ప్రేమిక లేదిక వన్నెల వాడికి
గరళం మ్రింగిన హృదయం చూడు.! #వన్నెలయ్య_గజల్ 259 #గజల్