Nojoto: Largest Storytelling Platform

#నాఛాలెంజ్ స్వభావోక్తి DivyaVani గారి బాటలోనే నేన

#నాఛాలెంజ్

స్వభావోక్తి DivyaVani గారి బాటలోనే నేను వెళ్తున్న. ఇవాల్టి నాఛాలెంజ్ పేరు స్వభావోక్తి. ఇది ఒక అలంకారం పేరు. అర్థాలంకారాల కోవలోకి వస్తుంది. అర్థాలంకారమంటే అర్థం చేత అందం పొందునది అని. ( ఇలగే శబ్దాలంకారాలు కూడ ఉన్నాయి. శబ్దాలంకారాలలో శబ్దం కవితకు అలంకారంగా నిలుస్తుంది. మన ప్రాసలు ఇత్యాదివి శబ్దాలంకారాలే.)

ఇప్పుడు స్వభావోక్తి గురించి చెప్పుకుందాం.
స్వభావోక్తి (స్వభావ + ఉక్తి) అంటే స్వభావమును తెలుపునది అని. ఒక వస్తువు యొక్క గుణాలను తెలిపేదే స్వభావోక్తి. ఇందులో పోలికలు ఉండనవసరం లేదు (ఉపమానాలంకారం) . అతిశయానికి (అతిశయోక్తి అలంకారాం) ఆస్కారమే లేదు! ఇది ఊహ కాదు (ఉత్ప్రేక్షాలంకారం) . రెండిటి మధ్య సారూప్యతను చెప్పదు (రూపకాలంకారం) . ఇది స్వభావోక్తి. మనం తీసుకున్న వస్తువు యొక్క స్వభావాన్ని తెలుపుతుంది. వర్ణనలో స్వభావోక్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. "అటజని కాంచె భూమిసురుడంబ చుంబి... " అను అలసాని పెద్దన్న గారి పద్యంలో స్వభావోక్తి అలంకారాన్ని మనం చూడవచ్చు.

ఇక స్వభావోక్తి కి ఉదాహరణ అంటారా... నేను పైన రాసినది స్వభావోక్తి యొక్క స్వభావమే...! 😉 

మీరు ఏదైనా ఒక వస్తువుని మీ కవిత లేక వ్యాసంలో తీసుకోండి... ఆ కవితలో #స్వభావోక్తి ని జోడించండి. ప్రాసలు లాంటివి కూడ జోడిస్తే మీ వర్ణనకు తిరుగుండదు మరి!!

amaterasu9739

amaterasu

New Creator