Nojoto: Largest Storytelling Platform

కనుల నిండ కలలైతే కన్నులెలా తెరవాలి.! కదలలేక నేనుంట

కనుల నిండ కలలైతే కన్నులెలా తెరవాలి.!
కదలలేక నేనుంటే అడుగులెలా వేయాలి.!

పూలలోన వాసనలా హృదయంలో నీవేగా
నీ రూపం మరవనపుడు మనసునెలా కదపాలి.!

చిగురంటూ లేనప్పుడు ప్రాణమున్న లేనట్టే
నైరాశ్యం తోడు కాగ ఆశలేలా చేయాలి.!

తాను లేని కళ్ళకింక భవితంతా శూన్యమేగ
కలలన్నీ కూలినాక బ్రతుకునెలా గడపాలి.!

భగ్నప్రేమ నీడలనే దాయుటెలా వన్నెలోడ
కలములోన తాను గాని కవితలెలా వ్రాయాలి.! #వన్నెలయ్య_గజల్ 237 #గజల్ #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
కనుల నిండ కలలైతే కన్నులెలా తెరవాలి.!
కదలలేక నేనుంటే అడుగులెలా వేయాలి.!

పూలలోన వాసనలా హృదయంలో నీవేగా
నీ రూపం మరవనపుడు మనసునెలా కదపాలి.!

చిగురంటూ లేనప్పుడు ప్రాణమున్న లేనట్టే
నైరాశ్యం తోడు కాగ ఆశలేలా చేయాలి.!

తాను లేని కళ్ళకింక భవితంతా శూన్యమేగ
కలలన్నీ కూలినాక బ్రతుకునెలా గడపాలి.!

భగ్నప్రేమ నీడలనే దాయుటెలా వన్నెలోడ
కలములోన తాను గాని కవితలెలా వ్రాయాలి.! #వన్నెలయ్య_గజల్ 237 #గజల్ #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్