Nojoto: Largest Storytelling Platform

ఎడారిలోనా చిగురులు తొడిగే మొక్కలు కావాలిప్పుడు.! త

ఎడారిలోనా చిగురులు తొడిగే మొక్కలు కావాలిప్పుడు.!
తడారిపోయిన కలలను మరువని కన్నులు కావాలిప్పుడు.!

చిక్కటి అడవులు దాటిన చరిత మనిషి పాదానికున్నదిగా
భూమిని వదిలి గ్రహాలు చేరే అడుగులు కావాలిప్పుడు.!

ప్రేరేపిస్తే ఉప్పు సముద్రం కోతి లంఘించి రాలేదా?
హృదయారణ్యం నెగళ్ళు చెసే వాక్కులు కావాలిప్పుడు.!

నీవెవరో తెలియాలంటే ఎవరెవరో చెప్పాలా?
అంతరాత్మనే నిలదీసే ప్రశ్నలు కావాలిప్పుడు.!

చలనం సున్నా చేసేస్తే ఆ చరవాణైనా ఎందుకులే
చక్కని వన్నెల చోటును చేరే పరుగులు కావాలిప్పుడు! #వన్నెలయ్య_గజల్ 349 #గజల్