Nojoto: Largest Storytelling Platform

తప్పించుకుని వెళ్లిపోవాలనుంది తప్పులేని వ్యక్తిత్

తప్పించుకుని వెళ్లిపోవాలనుంది 
తప్పులేని వ్యక్తిత్వంతో కూడా 
తప్పించుకుని తిరిగే మనుష్యుల మధ్య నుంచి 
తప్పించుకుని వెళ్లిపోవాలనుంది 
ఇప్పటికే దారితప్పి తిరియుగుతున్నవేళ 
తప్పిపోయిన మనిషిగా చెప్పించుకుంటున్నవేళ 
చేయిపట్టి దారిచూపే మానవతా మూర్తులు మృగ్యమవుతున్నవేళ 
మృగాలు తిరిగే అరణ్యాల్లోకి మౌనంగా తప్పించుకుని వెళ్లిపోవాలనుంది 
అప్పటికి మాత్రమే కావాలనుకునే బంధాలు 
ఆనందాలు తీరిన వెంటనే వదిలించుకునే వ్యక్తులు 
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక సంబంధాలు 
నీకిచ్చిన టైం స్లాట్ అయిపోగానే 
నిష్క్రమించక తప్పని అనుబంధపు జీవితాలు 
విచ్చలవిడితనం కాదేమో కానీ విచిత్రమైన మానసిక దౌర్భల్యం 
అందరిని ఆదరించుకునే సువిశాల సుదీర్ఘ హృదయం 
చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని సుందర మనస్తత్వం 
వద్దంటున్నా వదిలించుకోవాలనుకునే ఉత్సాహం 
ఆఖరికి మిగిలేది అనామిక అల్పకాల బంధం 
భయం లేదు బెంగలేదు ప్రపంచమంతా ఎదురుచూస్తూ  మరో బంధానికి సిద్ధమై 
తప్పే చేయని మనసుని తప్పయించుకు తిరిగే మనుషులనుంచి 
తప్పించుకుని వెళ్లిపోవాలనుంది 
ఆ తప్పెప్పటికీ ఒప్పుకొని మనసులనుంచి 
తప్పించుకుని వెళ్లిపోవాలనుంది

©gopi kiran
  #kavithalu #Poetry #story #motivate #Emotional