Nojoto: Largest Storytelling Platform

నా దేశం జెండాలో భావిస్తూ ఉంటాను.! పౌరునిగా నా పాత్

నా దేశం జెండాలో భావిస్తూ ఉంటాను.!
పౌరునిగా నా పాత్రను పోషిస్తూ ఉంటాను.!

పతాకమై నిలుచుంటే నీడంటూ ఏముంటది
ఆసేతూ హిమాచలం ప్రవహిస్తూ ఉంటాను.!

ము'వ్వన్నెల' రెపరెపలు ఐక్యతనే సూచించే
పలు మతాల గొడవేంటని ప్రశ్నిస్తూ ఉంటాను.!

మట్టి కొరకు ప్రాణాలను ఇవ్వమంది మా అమ్మ (భరతమాత)
ఆ పిదపా జెండాలో కనిపిస్తూ ఉంటాను.!

ఒక్కరోజు ఎగరేయుట నా కెందుకొ నచ్చదసలు
దించకుండ గుండెల్లో ఎగరేస్తూ ఉంటాను.! #వన్నెలయ్య_గజల్ 288 #గజల్
నా దేశం జెండాలో భావిస్తూ ఉంటాను.!
పౌరునిగా నా పాత్రను పోషిస్తూ ఉంటాను.!

పతాకమై నిలుచుంటే నీడంటూ ఏముంటది
ఆసేతూ హిమాచలం ప్రవహిస్తూ ఉంటాను.!

ము'వ్వన్నెల' రెపరెపలు ఐక్యతనే సూచించే
పలు మతాల గొడవేంటని ప్రశ్నిస్తూ ఉంటాను.!

మట్టి కొరకు ప్రాణాలను ఇవ్వమంది మా అమ్మ (భరతమాత)
ఆ పిదపా జెండాలో కనిపిస్తూ ఉంటాను.!

ఒక్కరోజు ఎగరేయుట నా కెందుకొ నచ్చదసలు
దించకుండ గుండెల్లో ఎగరేస్తూ ఉంటాను.! #వన్నెలయ్య_గజల్ 288 #గజల్