Nojoto: Largest Storytelling Platform

పాఠశాల జ్ఞాపకాలు నా కలమును పాయలేదు తరగతి గది దృశ్య

పాఠశాల జ్ఞాపకాలు నా కలమును పాయలేదు
తరగతి గది దృశ్యాలను నా కనులను వీడలేదు

సరిగమలే ప్రాణమైన తీగ తెగిన వీణనైతి
బాల్యంలో కోకిలలా నా గొంతును విప్ప లేదు

స్నేహితున్ని ఏడిపిస్తు శతనామం వ్రాసినాము
జుంటి తేనె అల్లరులవి నా మనసును దాటలేదు

చిన్నవేలు చిన్నబోయె గురువు గోరు కత్తిరిస్తె
అలుపు లేని కత్తిరింపు నా దినుసును మార్చలేదు

ఆటలలో ఆరితేరి చదువులోన పండిపోయి
రెండ్రేండు ముత్యాలే మా గుంపును ఓడ లేదు

మండల్లో ఆటలంట గుండెల్లో సంబరాలు
వన్నెలోడ! ధన రాశీ ఆ వయసును కూర్చలేదు #వన్నెలయ్య_గజల్ 43
#గజల్ #గజల్స్ #పాఠశాల #బాల్యం #school #schooldays

#వన్నెలయ్య_గజల్ 43 #గజల్ #గజల్స్ #పాఠశాల #బాల్యం #School #SchoolDays