Nojoto: Largest Storytelling Platform

ఎందుకంత నరకమంట మెతుకునైన మింగనీక మంటపెట్టి నోరుకు

ఎందుకంత నరకమంట మెతుకునైన మింగనీక 
మంటపెట్టి నోరుకుట్టి గొంతునైన ఎత్తనీక 

ఏళ్ళెన్నో గడిచినాయి ఎండుటాకు ఆశలల్లె 
చిగురులేక చింతపోక చితిలొకైన చేరనీక 

మాట్లాడుటె పాపమౌతు బంధముందె శాపమౌతు 
కొనప్రాణం మరుజన్మకు విడుదలైన కోరనీక 

ఇంట మగ్గి బైట నవ్వు ఈ లోకం పోకడలకు
ఆత్మెకెంత శిక్షపడే మనసునైన చూపనీక  

చెప్పుకుంటె తరిగిపోదు చెప్పకుంటె మాసిపోదు
కలత లతై అల్లుకుందె స్వాంతనైన తాకనీక  Monica S thank u for ur poke...🖤

#గజల్ #telugu #లత #teluguvelugu
ఎందుకంత నరకమంట మెతుకునైన మింగనీక 
మంటపెట్టి నోరుకుట్టి గొంతునైన ఎత్తనీక 

ఏళ్ళెన్నో గడిచినాయి ఎండుటాకు ఆశలల్లె 
చిగురులేక చింతపోక చితిలొకైన చేరనీక 

మాట్లాడుటె పాపమౌతు బంధముందె శాపమౌతు 
కొనప్రాణం మరుజన్మకు విడుదలైన కోరనీక 

ఇంట మగ్గి బైట నవ్వు ఈ లోకం పోకడలకు
ఆత్మెకెంత శిక్షపడే మనసునైన చూపనీక  

చెప్పుకుంటె తరిగిపోదు చెప్పకుంటె మాసిపోదు
కలత లతై అల్లుకుందె స్వాంతనైన తాకనీక  Monica S thank u for ur poke...🖤

#గజల్ #telugu #లత #teluguvelugu