Nojoto: Largest Storytelling Platform

ఆమె లేక బాధెంతో హృదయములో పొంగింది.! సరిత వలే కన్నీ

ఆమె లేక బాధెంతో హృదయములో పొంగింది.!
సరిత వలే కన్నీరై కన్నులలో పారింది.!

భూలోకం అంచు చివర ఉన్నానా అన్నట్టే
చెలియ లేక అచేతనము అడుగులలో నిండింది.!

మనసు పగిలి కొలువులోన సృజనంతా మసకబారె
నష్టమంత పిలిచినట్లు కర్మలలో కులికింది.!

ఇంకెందుకు ఈ బ్రతుకని లోలోపల గోల గోల
విసుగు పుట్టి నైరాశ్యం ఆశలలో కూడింది.!

హిందోళం రాగంలో వన్నెలయ్య ఆందోళన
పాడి చూడు ఒక్కసారి పదములలో చేరింది.! #వన్నెలయ్య_గజల్ 252
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#వన్నెలయ్య_భగ్నప్రేమ_గజల్
#గజల్ #భగ్నప్రేమ #gazallover #lovefailure #hertbroken
ఆమె లేక బాధెంతో హృదయములో పొంగింది.!
సరిత వలే కన్నీరై కన్నులలో పారింది.!

భూలోకం అంచు చివర ఉన్నానా అన్నట్టే
చెలియ లేక అచేతనము అడుగులలో నిండింది.!

మనసు పగిలి కొలువులోన సృజనంతా మసకబారె
నష్టమంత పిలిచినట్లు కర్మలలో కులికింది.!

ఇంకెందుకు ఈ బ్రతుకని లోలోపల గోల గోల
విసుగు పుట్టి నైరాశ్యం ఆశలలో కూడింది.!

హిందోళం రాగంలో వన్నెలయ్య ఆందోళన
పాడి చూడు ఒక్కసారి పదములలో చేరింది.! #వన్నెలయ్య_గజల్ 252
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#వన్నెలయ్య_భగ్నప్రేమ_గజల్
#గజల్ #భగ్నప్రేమ #gazallover #lovefailure #hertbroken