Nojoto: Largest Storytelling Platform

హంస లాగ బ్రతకాలని మనసేదో గోల చేయు హింస లన్ని విడవా

హంస లాగ బ్రతకాలని మనసేదో గోల చేయు
హింస లన్ని విడవాలని దినుసేదో గోల చేయు

సంబంధం లేదసలే రైతు పంట తడిపె మొయిలు
చేయూతను ఇవ్వలని కరమేదో గోల చేయు

క్రింది చూపు లేదసలే ఆకాశం పాకె లత
తీక్షణతో చూడాలని కనులేదో గోల చేయు

వెనక తిరిగి రాదసలే ముందునకే సాగు నదము
గమ్యాలను చేరాలని అడుగేదో గోల చేయు

నిట్టూర్పే లేదసలే చదువుతుంటె గజల్ గీతి
వన్నెలోన్ని వ్రాయమని కలమేదో గోల చేయు #వన్నెలయ్య_గజల్ 63
#గజల్స్ #గజల్స్
#vnlmt ఇవ్వాలని*
హంస లాగ బ్రతకాలని మనసేదో గోల చేయు
హింస లన్ని విడవాలని దినుసేదో గోల చేయు

సంబంధం లేదసలే రైతు పంట తడిపె మొయిలు
చేయూతను ఇవ్వలని కరమేదో గోల చేయు

క్రింది చూపు లేదసలే ఆకాశం పాకె లత
తీక్షణతో చూడాలని కనులేదో గోల చేయు

వెనక తిరిగి రాదసలే ముందునకే సాగు నదము
గమ్యాలను చేరాలని అడుగేదో గోల చేయు

నిట్టూర్పే లేదసలే చదువుతుంటె గజల్ గీతి
వన్నెలోన్ని వ్రాయమని కలమేదో గోల చేయు #వన్నెలయ్య_గజల్ 63
#గజల్స్ #గజల్స్
#vnlmt ఇవ్వాలని*