Nojoto: Largest Storytelling Platform

ఆరిపోతుందనుకుంటే చెలరేగుతు మనసుమంట మానిపోతుందనుకుం

ఆరిపోతుందనుకుంటే చెలరేగుతు మనసుమంట
మానిపోతుందనుకుంటే మరింత ముదురుతు కన్నీరుకంట
చీకటి నీడన రాతిరి దెప్పే ప్రశ్నలకు బదులెవరిద్దురు
పగటి గూటిన వెలుగు చూపే వెలితిని వేలెత్తేదెవ్వరు
గాఢనిద్దుర గోడల నడుమ 
గొడుగక్కని వస్తూల నడుమ
అస్పష్టముగ అగమ్యగోచరముగ 
జీవిత ముక్కలు 
అతికించు సత్తువను మనసుమంట మింగేస్తుంటే
బతికించు వరమును కాయం కాలదన్నుకుంటుంటే
బిక్కుమని బిత్తరచూపులు
అవ్యక్త స్థితిన అలసిన పెదాలు...
మనసుకు ఊపిరికేంటో ఇంత సంబంధం
బావుంటే ఊపిరెక్కువై ఉక్కిరిబిక్కిరైనట్టు
కాస్త చెదిరితే ఊపిరాడక తల్లడిల్లినట్టు
చిత్రమాడుతుంటే...
తపిస్తూనో విలపిస్తూనో ముడేసిన పెదాల ముడిప్పక 
మనసే కలం పట్టి రాస్తూన్న ఈ క్షణానికి సరియగు మాటలేవి...
తూగగల ఉపమేయ,ఉపమానాలేవి
తడిసిన అక్షరాలు తప్ప
వణికిన కాగితవాసాలు తప్ప.. #మనసుమంట #మనసు #కన్నీరు #తెలుగు #yqkavi #telugu #teluguvelugu

#మనసుమంట #మనసు #కన్నీరు #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu