Nojoto: Largest Storytelling Platform

కలిసుంటే చిరు చినుకే నదమౌతుంది.! పోతుంటే కొండలలో ప

కలిసుంటే చిరు చినుకే నదమౌతుంది.!
పోతుంటే కొండలలో పథమౌతుంది.!

బలముందని ధనముందని మిడిసి పడకుమా
తప్పు సుమా కాలంలో క్షయమౌతుంది.!

నా నుంచీ మన వరకు రాకపోతివా
తప్పు సుమా నీ హృదయం కతమౌతుంది.!

పొద్దులన్ని మరిచిపోయి హద్దు చెరపకూ
తప్పు సుమా అత్యాశే రణమౌతుంది.!

తాటాకున పడి ఉందని, తక్కువెందుకు
తప్పు సుమా కవితే ఒక జయమౌతుంది.!

తప్పు సుమా మత్తే ఒక జగమౌతుంది #వన్నెలయ్య_గజల్ 335 #గజల్
కలిసుంటే చిరు చినుకే నదమౌతుంది.!
పోతుంటే కొండలలో పథమౌతుంది.!

బలముందని ధనముందని మిడిసి పడకుమా
తప్పు సుమా కాలంలో క్షయమౌతుంది.!

నా నుంచీ మన వరకు రాకపోతివా
తప్పు సుమా నీ హృదయం కతమౌతుంది.!

పొద్దులన్ని మరిచిపోయి హద్దు చెరపకూ
తప్పు సుమా అత్యాశే రణమౌతుంది.!

తాటాకున పడి ఉందని, తక్కువెందుకు
తప్పు సుమా కవితే ఒక జయమౌతుంది.!

తప్పు సుమా మత్తే ఒక జగమౌతుంది #వన్నెలయ్య_గజల్ 335 #గజల్