Nojoto: Largest Storytelling Platform

మగాడే మూలం నీ అంగీకారం వ్యర్ధం ఎందుకనకు! పోషిస్తాడ

మగాడే మూలం
నీ అంగీకారం వ్యర్ధం
ఎందుకనకు!
పోషిస్తాడు గనక
కుటుంబాన్నిస్తాడు గనక
నీకు రక్షణగ నిలుస్తాడు గనక
జీవితాంతం నీకోసమే కష్టపడతాడు గనక
ఇంత చేయగ బోడి నీదేం గొప్ప?
తన ప్రపంచానికై నీ ప్రపంచాన్ని వదిలేస్కోడం కూడా ఓ గొప్పేనా!
నీ అభిష్టమున్నా లేకున్నా తలవంచి కాపురం చేయడమూ ఓ గొప్పేనా!
పరివారపు పరువు కోసం నీ గొంతు నొక్కేస్కోవడమూ ఓ గొప్పేనా!
తన వంశవృద్ధికి మూలమై తన కుటుంబానికి 
తలలో నాలుకై నువు కొవ్వొత్తివవడమూ 
ఓ గొప్పేనా!
ఎన్ని బంధాలకు భాగస్వామియైనా కడకు 
శేషజీవితాన నువు మాత్రమే తోడుండమూ 
ఓ గొప్పేనా!

ఎవరి ధోరణిలో వాళ్ళు గొప్పే 

ఇద్దరూ సమానమన్న విషయమెప్పటికీ కల్లే
ఎప్పటికి ఆధిపత్యానికే ఆతిథ్యమిస్తుంటే... చర్చకు సిద్ధంగా లేను... 

#గొప్ప #సమానం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

చర్చకు సిద్ధంగా లేను... #గొప్ప #సమానం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu