Nojoto: Largest Storytelling Platform

మా ప్రేమకు బాధలలో తుడుచుకున్న కనులు సాక్షి.!! సరదా

మా ప్రేమకు బాధలలో తుడుచుకున్న కనులు సాక్షి.!!
సరదాలకు యదలపై వేసుకున్న పూలు సాక్షి.!!

మృదుభాషిణి మేని సోకు తాకినట్టు ఋజువడిగితె
విరబూసిన పూదోటలొ కలుసుకున్న చోటు సాక్షి.!!

సప్తవర్ణ జీవితాన్ని కోరుచర్యలేవనగా
హోళి రోజు నవ్వుకుంటు పూసుకున్న రంగు సాక్షి.!!

యదలోతును చెలి ముందర చూపింది ప్రేమ రోజు
నా హృదయం తాజ్ మహల్ ఇచ్చుకున్న గుర్తు సాక్షి.!!

ఏనాటికి ఇంకిపోని నాప్రేమను ప్రశ్నిస్తే
తనను తాక బోయినపుడు నొచ్చుకున్న జనం సాక్షి.!!

వన్నెలయ్య తమకములో ఆమె కాక ఇంకెవరూ?
తలపంతా తపననింపి రాసుకున్న లేఖ సాక్షి.!! #వన్నెలయ్య_గజల్ 74
#వన్నెలయ్య_పండగ #గజల్ #గజల్స్ #హోళీ #ప్రేమికులు 
#vnlmt మా వలపుకు యదలపైన*