Nojoto: Largest Storytelling Platform

నా ఎదనే తడుముకుంటె త్రాకినావు మిత్రమా.! లో వ్యథలే

నా ఎదనే తడుముకుంటె త్రాకినావు మిత్రమా.!
లో వ్యథలే రగులుకుంటె ఆర్పినావు మిత్రమా.!

యుగాలన్ని క్షణాలయ్యె నీ చెలిమే గొప్పదిలే
ఆనందం సంద్రంగా మార్చినావు మిత్రమా.!

అంతరాల దొంతరలే మన మధ్యన లేవు లేవు
స్నేహానికి కొత్తర్థం చెప్పినావు మిత్రమా.!

తళుకు బెళుకు రాళ్ళేలా తట్టెడని వేమననా
నిక్కమైన నీలంగా నిలిచినావు మిత్రమా.!

ప్రపంచాన్ని పరమాత్మను చుట్టేసే కథ మనది
వన్నెల్లో వెన్నెల్లో కలిసినావు మిత్రమా.! #వన్నెలయ్య_గజల్ 285
#వన్నెలయ్య_భక్తి_గజల్
#గజల్