Nojoto: Largest Storytelling Platform

కుల మతాల కంచెలోన నలిగిపోయె ప్రేమొకటి.! ఆ గీతలు దాట

కుల మతాల కంచెలోన నలిగిపోయె ప్రేమొకటి.!
ఆ గీతలు దాటకుండ ఆగిపోయె అడుగొకటి.!

పెద్దలంత కార్మొయిల్లు కమ్మేసెను వెన్నెలను
ఆమె రూపు కానరాక మిగిలిపోయె చూపొకటి.!

తాను లేక ఏ బంధం సుమ గంధం ఇకమీదట?
తొలిప్రేమ విషమిస్తే పగిలిపోయె మనసొకటి

ప్రేమ వీణ పాడగనే తీగ తెగెను గాయపర్చి
అసంపూర్ణ గీతికలా ఆగిపోయె కథ ఒకటి.!

ఎవరెవరో ఓర్వలేక ప్రేమ పంట చెడిపారా.?
వన్నెలయ్య కన్నులలో చెదిరిపోయె స్వప్నమొకటి.! #వన్నెలయ్య_గజల్ 241 #గజల్ #భగ్నప్రేమ #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్