Nojoto: Largest Storytelling Platform

అంతే తెలియని ఆశల వలయం! ఆగక తిరిగే కోర్కెల రాట్నం న

అంతే తెలియని ఆశల వలయం!
ఆగక తిరిగే కోర్కెల రాట్నం
నీటిలొ పుట్టిన గాలి బుడగలు
నేలను చేరగ ఏమవ్వునురా?

ఆశల దారి ఆఖరు వరకు
వెళ్ళాలంటే కుదరదు లేరా
పూటకు పుట్టే కోర్కెలు కోటి
తీరాలంటే చాలదు పోరా!

జీవితమంటే మాయల గారడి
గెలిచావంటూ సంబరమేలా?
చెప్పగ విన్నది చూడగ కన్నది
ప్రపంచమన్నది భ్రాంతేలేరా!

ఉచ్చనీచములను భేదములేల?
నింగిని తాకే అంతస్తులు ఏలా?
భూమిపై నిలువుగ తిరిగేదెంతర?
పేర్చిన ఆస్తిలొ పూడ్చేదెంతర? #yqkavi
#teluguvelugu 
#amaterasutelugu 

Monica , thank you for the encouragement (poke).
అంతే తెలియని ఆశల వలయం!
ఆగక తిరిగే కోర్కెల రాట్నం
నీటిలొ పుట్టిన గాలి బుడగలు
నేలను చేరగ ఏమవ్వునురా?

ఆశల దారి ఆఖరు వరకు
వెళ్ళాలంటే కుదరదు లేరా
పూటకు పుట్టే కోర్కెలు కోటి
తీరాలంటే చాలదు పోరా!

జీవితమంటే మాయల గారడి
గెలిచావంటూ సంబరమేలా?
చెప్పగ విన్నది చూడగ కన్నది
ప్రపంచమన్నది భ్రాంతేలేరా!

ఉచ్చనీచములను భేదములేల?
నింగిని తాకే అంతస్తులు ఏలా?
భూమిపై నిలువుగ తిరిగేదెంతర?
పేర్చిన ఆస్తిలొ పూడ్చేదెంతర? #yqkavi
#teluguvelugu 
#amaterasutelugu 

Monica , thank you for the encouragement (poke).
amaterasu9739

amaterasu

New Creator