Nojoto: Largest Storytelling Platform

విత్తులోని తపన చూడు మట్టినైన చీల్చుతుంది.! గుండెలో

విత్తులోని తపన చూడు మట్టినైన చీల్చుతుంది.!
గుండెలోని కళను చూడు కొండనైన కూల్చుతుంది.!

అడవిదొంగ రచన చదివి లోకమంత హర్షించే
గురువు మాట బోధ చూడు జడమునైన కదుపుతుంది!

వినయ రత్నముంటె చాలు విలువైనవి నీ ముందే
గరికపోచ విధము చూడు గాలినైన గెలుస్తుంది.!

బంధు బలగ మెందుకులే బుద్ది మంతుడొకడు ఉంటే..
ఒక్క నిప్పు రవ్వ చూడు అడవినైన కాల్చుతుంది.!

నీ ముందే వన్నెలమ్మ వెతలెందుకు రాత్రుల్లో
విజయ నవ్వు సరిగ చూడు లేమినైన పూడ్చుతుంది.! #వన్నెలయ్య_గజల్ 317 #గజల్