Nojoto: Largest Storytelling Platform

లోకుల కాకుల గోలలు దాటితె కోకిల రవములు నను చేరే.! స

లోకుల కాకుల గోలలు దాటితె కోకిల రవములు నను చేరే.!
సుశ్రుతి వింటూ నాలో దిగితే కవుల ఊహలు నను చేరే.!

కాలకూటము యదలో దాచే స్నేహము నాకే తెలియకనే
కల్మశ మెరుగని పాల నురగలు పాపల నవ్వులు నను చేరే.!

పూటకు మాటకు ఊసరవెల్లుల రూపులవేవో పులమకనే
హాయిని గూర్చే అందాలొలికే సింగిడి రంగులు నను చేరే.!

రక్షణ శిక్షణ లక్షణ తీక్షణ శుభేక్షణనే నే కోరగనే
చల్లగ మెల్లగ వెన్నెల వెలుగుల భారతి చూపలు నను చేరే.!

స్వార్థపు వ్యర్థపు మురికి గుంటలు నా జీవనమున పారకనే
వన్నెల మనసుల తీయని ప్రేమల కుసుమ బాలలు నను చేరే.! #వన్నెలయ్య_గజల్ 311 #గజల్