Nojoto: Largest Storytelling Platform

ముళ్ళబాట లోన నన్ను పంపినది నీవేనా.!? నడిచిపోతె పూల

ముళ్ళబాట లోన నన్ను పంపినది నీవేనా.!?
నడిచిపోతె పూలు పరిచి ఉంచినది నీవేనా.!?

పరిహాసం ఇందనమే మునుముందుకు కదిలేందుకు
ఓడిపోతె వెక్కిరిస్తు నవ్వినది నీవేనా.!?

అసంభవాలున్నప్పుడు గెలువడమే ఘనతంటూ..
ముప్పులనే ఉప్పెనలో తోసినది నీవేనా.!?

బాధలొచ్చి బోధ చేసి పోతాయని తెలిసింది
కన్నీరుల సంద్రంలో ముంచినది నీవేనా.!?

రణంలోన జయం శుభం వెన్నెలోడి వచనాలే
నా విరచిత కవితలలో కదిలినది నీవేనా.!? #వన్నెలయ్య_గజల్ 284
#వన్నెలయ్య_భక్తి_గజల్
#గజల్
ముళ్ళబాట లోన నన్ను పంపినది నీవేనా.!?
నడిచిపోతె పూలు పరిచి ఉంచినది నీవేనా.!?

పరిహాసం ఇందనమే మునుముందుకు కదిలేందుకు
ఓడిపోతె వెక్కిరిస్తు నవ్వినది నీవేనా.!?

అసంభవాలున్నప్పుడు గెలువడమే ఘనతంటూ..
ముప్పులనే ఉప్పెనలో తోసినది నీవేనా.!?

బాధలొచ్చి బోధ చేసి పోతాయని తెలిసింది
కన్నీరుల సంద్రంలో ముంచినది నీవేనా.!?

రణంలోన జయం శుభం వెన్నెలోడి వచనాలే
నా విరచిత కవితలలో కదిలినది నీవేనా.!? #వన్నెలయ్య_గజల్ 284
#వన్నెలయ్య_భక్తి_గజల్
#గజల్