Nojoto: Largest Storytelling Platform

జీవనమున చీకట్లను కరిగించగ వస్తావా.! విజ్ఞానపు దీపా

జీవనమున చీకట్లను కరిగించగ వస్తావా.!
విజ్ఞానపు దీపాలను వెలిగించగ వస్తావా.!

ఎండలలో గుండెలలో వేదనలే శిశిరాలు
ప్రమోదాల వాసంతం మొలిపించగ వస్తావా.!

అంతరంగ నింగిలో లక్ష్యమనే తళుకుందా?
ఆశయాల తారకలను పూయించగ వస్తావా.!

పరిమళమే పంచుతుంది రాలిపోయి పూవైనా
దారంతా సుగంధాలు విదిలించగ వస్తావా.!

ఒక శ్రావణ మేఘంలా అజ్ఞానం కమ్ముకుందా?
శరత్పూర్ణ వ(వె)న్నెలలా వికసించగ వస్తావా.! #వన్నెలయ్య_గజల్ 338 #గజల్
జీవనమున చీకట్లను కరిగించగ వస్తావా.!
విజ్ఞానపు దీపాలను వెలిగించగ వస్తావా.!

ఎండలలో గుండెలలో వేదనలే శిశిరాలు
ప్రమోదాల వాసంతం మొలిపించగ వస్తావా.!

అంతరంగ నింగిలో లక్ష్యమనే తళుకుందా?
ఆశయాల తారకలను పూయించగ వస్తావా.!

పరిమళమే పంచుతుంది రాలిపోయి పూవైనా
దారంతా సుగంధాలు విదిలించగ వస్తావా.!

ఒక శ్రావణ మేఘంలా అజ్ఞానం కమ్ముకుందా?
శరత్పూర్ణ వ(వె)న్నెలలా వికసించగ వస్తావా.! #వన్నెలయ్య_గజల్ 338 #గజల్