Nojoto: Largest Storytelling Platform

తోడు నిలిచె చేయొక్కటి కలిసేందుకు సిద్ధమైంది.! మురి

తోడు నిలిచె చేయొక్కటి కలిసేందుకు సిద్ధమైంది.!
మురిసిపోయి అడుగిప్పుడు కదిలేందుకు సిద్ధమైంది.!

పూలతోట విహారమున తాను కొంటె చూపు విసర
ప్రేమ పూవు ఎదలోనే పూసేందుకు సిద్ధమైంది.!

మేఘమాల వైపు చూసి ఆమెందుకొ నవ్వుతుంది
వలపు చినుకు నాలోనా కురిసేందుకు సిద్ధమైంది.!

పొలం గట్లు దాటు ఆమె నడుమొంపులు తెలిసిపోయె
ఊరుకోక బురద చేయి తడిమేందుకు సిద్ధమైంది.!

ప్రతీ పూట ఆమె నోట ప్రేమ రోజు మాటలంట
వన్నెలయ్య హృదయాన్ని గెలిచేందుకు సిద్ధమైంది! #వన్నెలయ్య_గజల్ 217 #గజల్