Nojoto: Largest Storytelling Platform

మధురోహల ఆమనినై జన్మిస్తా ఈ ఇలలో సరాగాల కుసుమాలతొ అ

మధురోహల ఆమనినై జన్మిస్తా ఈ ఇలలో
సరాగాల కుసుమాలతొ అర్చిస్తా నీ గుడిలో

నీ చెంతన శబ్దార్థం నాకెంతో ప్రియం వరం
గ్రోలాలని పసివాన్నై తపియిస్తా నీ ఒడిలో

సప్తాశ్వపు రథమెక్కీ ప్రభవింతును గుండెలలో
పదపదమున విక్రాంతై ధ్వనియిస్తా నీ బడిలో

పచ్చ పచ్చ ఈ జగతికి వలపు చినుకే కారణం
పరిమళాల బంధాలను సృష్టిస్తా నీ జడలో

లక్షణమై అక్షరమై వన్నెలలో వెన్నెలనై
అజ్ఞానం తెరను తీసి తరియిస్తా ఈ కలలో #వన్నెలయ్య_గజల్ 351 #గజల్
మధురోహల ఆమనినై జన్మిస్తా ఈ ఇలలో
సరాగాల కుసుమాలతొ అర్చిస్తా నీ గుడిలో

నీ చెంతన శబ్దార్థం నాకెంతో ప్రియం వరం
గ్రోలాలని పసివాన్నై తపియిస్తా నీ ఒడిలో

సప్తాశ్వపు రథమెక్కీ ప్రభవింతును గుండెలలో
పదపదమున విక్రాంతై ధ్వనియిస్తా నీ బడిలో

పచ్చ పచ్చ ఈ జగతికి వలపు చినుకే కారణం
పరిమళాల బంధాలను సృష్టిస్తా నీ జడలో

లక్షణమై అక్షరమై వన్నెలలో వెన్నెలనై
అజ్ఞానం తెరను తీసి తరియిస్తా ఈ కలలో #వన్నెలయ్య_గజల్ 351 #గజల్