Nojoto: Largest Storytelling Platform

నువ్వు లేని జన్మ వద్దనుకుంటా... మరుజన్మలోనైనా తోడ

నువ్వు లేని జన్మ వద్దనుకుంటా...

మరుజన్మలోనైనా తోడవుతానంటే...

నిన్ను చూడలేని కనులు మూసే నేనుంటా...

కలలోనైనా కనబడతానంటే...

నీతో మాట్లాడని ఈ మాట వద్దనుకుంటా...

నా మౌనం నీ మనసుని తాకుతుందంటే...

నీ జాడ తెలుపని ప్రపంచాన్ని పరాయి అనుకుంటా...

నా ప్రపంచం నువ్వు అవుతానంటే...

నీ చెంత చేరని నా పాదములు నావి కావనుకుంటా...

నీ పాదాలు నాకై వెతుకుతూ వస్తానంటే...

నిన్ను మరువలేని నన్నే మర్చిపోతా...

నా మరువలేని జ్ఞాపకాల్లో భాగం అవుతానంటే...

నువ్వు నేను అని వేరు చేసిన ఈ కవిత కల అనుకుంటా...

నాలో ఏకం అవుతానంటే... #నీకై నిరీక్షణ

#నీకై నిరీక్షణ