ప్రేమలేఖ నిన్ను ప్రేమించే కాలం పెరిగేకొద్ది పదాలు చాలట్లేదు నీపై నా ప్రేమని తెలుప నిన్నలోని మధుర జ్ఞాపకాలని రాయనా? నేటిలోని తీపి ముచ్చట్లని రాయనా? రేపటిలోని అందమైన కలల ప్రపంచం గురించి రాయనా? ఎమని రాయను ఎన్నని రాయను? వాడుక బాష వెనకబడిపోయింది తెలిసిన బాష తెలివి తప్పింది నేర్చుకున్న బాష నా ప్రేమని చెప్ప చాలా చిన్నదై పోయింది మన మధ్య ఉంది ఒక్క బంధమంటే గుక్కతిప్పకుండా వ్యక్తపరచ గలను అవసరముంటే అమ్మ వి అవుతావు నా వళ్ళ కానపుడు నాన్నలా తెలివి నేర్పుతావు ఆపదవస్తే తోబుట్టువులా తోడుగా ఉంటావు ఒంటరిగా అనిపించకుండా స్నేహితుడిలా సరదాగా ఉంటావు కష్టమంటూ వస్తే నన్ను కాపు కాచే కంచె లా నా ముందు నిలుస్తావు ఇన్ని బంధాలను కలబోసుకున్న నీ ప్రేమకి ఎం పేరు పెట్టను ఏ బాష వాడి నా భావాలను ప్రేమ లేఖగా రాయను చెప్పు...... ©vineelasubramanyam #Love #ValentinesDay #loveletter #Pyar #prema