Nojoto: Largest Storytelling Platform

మేనుకైన గాయమేదొ మానునులే మరునాడు మనసుకైన గాయమసలు మ

మేనుకైన గాయమేదొ
మానునులే మరునాడు
మనసుకైన గాయమసలు
మానేనా? ఏనాడు?

మాయనట్టి గాయాలకు
మరపొకటే మందు కదా
ఆనందపు విరులొలుకు
సుగంధాలు అవే కదా

ఒంటి చేత్తొ సాగరాన్ని
ఈదగలడు మానవుడు
ఒంటరినని తలచినచో
కదలగలడ? అడిగి చూడు

గాలి లేక గాలిపటము
ఎగర గలద దివిలోన?
ప్రేమ లేక మనగలిగిన
మనుజుడెవడు పృథివిలోన? #yqkavi
#teluguvelugu
#amaterasutelugu 
#ఘంటసాల gaari "kala kaanidi" baaNee loe..
మేనుకైన గాయమేదొ
మానునులే మరునాడు
మనసుకైన గాయమసలు
మానేనా? ఏనాడు?

మాయనట్టి గాయాలకు
మరపొకటే మందు కదా
ఆనందపు విరులొలుకు
సుగంధాలు అవే కదా

ఒంటి చేత్తొ సాగరాన్ని
ఈదగలడు మానవుడు
ఒంటరినని తలచినచో
కదలగలడ? అడిగి చూడు

గాలి లేక గాలిపటము
ఎగర గలద దివిలోన?
ప్రేమ లేక మనగలిగిన
మనుజుడెవడు పృథివిలోన? #yqkavi
#teluguvelugu
#amaterasutelugu 
#ఘంటసాల gaari "kala kaanidi" baaNee loe..
amaterasu9739

amaterasu

New Creator