Nojoto: Largest Storytelling Platform

మృగశిరలో తొలకరితో పలకరించె చినుకులే.!? తడిసిపోయి మ

మృగశిరలో తొలకరితో పలకరించె చినుకులే.!?
తడిసిపోయి మురిసిపోయి పులకరించె తనువులే.!?

ఆ నింగికి ఈ నేలకు నిచ్చెనలా చినుకు చినుకు
వర్ష ధార తడుపుతుంటె సంతసించె తోటలే.!?

అరక కట్టి నడయాడే పాదాలే మహికి ముద్దు
రైతన్నల చరణు తాకి సంతసించె అణువులే.!?

మేలు పొంది మరిచిపోవు మనిషి కాదు దాన్యాలు
వసుధమ్మకు పచ్చ చీర కానుకిచ్చె విత్తులే.!?

వన్నెల్లో మనుగడకు వానలేగ ఆధారం
పల్లెలన్ని నవ్వులతో చిగురించే మోములే.!? #వన్నెలయ్య_గజల్ 268 #గజల్