Nojoto: Largest Storytelling Platform

వేదనెంత పడ్డానో నీ మౌనము తాళలేక.! వేడుకెంత మరిచానో

వేదనెంత పడ్డానో నీ మౌనము తాళలేక.!
వేడుకెంత మరిచానో నీ రూపము మరవలేక.!

నీ చెంతకు నేనొస్తే దూరంగా వెళ్తావు
ఎంత మదన పడ్డానో నీ పయనము చూడలేక.!

ప్రాణ మన్న మనసులోన అసహ్యం ఎలా పుట్టె?
మనసెంతో చిద్రమాయె నీ హృదయము చదవలేక.!

గాడమైన ప్రేమలో కలవరమే రాత్రంతా
బ్రతుకు బాట దుర్భరమే నీ స్మరణము ఆపలేక.!

మరో గూడు చెలియ చేరి రాగలదా వన్నెలయ్య?
కనుల కెంత క్షోభో మరి ఆగమనము కానలేక.! #వన్నెలయ్య_గజల్ 199 #గజల్స్ #తెలుగుగజల్ #భగ్నహృదయం #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
వేదనెంత పడ్డానో నీ మౌనము తాళలేక.!
వేడుకెంత మరిచానో నీ రూపము మరవలేక.!

నీ చెంతకు నేనొస్తే దూరంగా వెళ్తావు
ఎంత మదన పడ్డానో నీ పయనము చూడలేక.!

ప్రాణ మన్న మనసులోన అసహ్యం ఎలా పుట్టె?
మనసెంతో చిద్రమాయె నీ హృదయము చదవలేక.!

గాడమైన ప్రేమలో కలవరమే రాత్రంతా
బ్రతుకు బాట దుర్భరమే నీ స్మరణము ఆపలేక.!

మరో గూడు చెలియ చేరి రాగలదా వన్నెలయ్య?
కనుల కెంత క్షోభో మరి ఆగమనము కానలేక.! #వన్నెలయ్య_గజల్ 199 #గజల్స్ #తెలుగుగజల్ #భగ్నహృదయం #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్