Nojoto: Largest Storytelling Platform

వలపులను నాలోనా నాటినావు దొరసానీ విరహాలను యదలోన మీట

వలపులను నాలోనా నాటినావు దొరసానీ
విరహాలను యదలోన మీటినావు దొరసానీ

విరులలోని మరందాలు ప్రియకములే తాగినట్టు
నా మదిలో ప్రేమ వెన్న దోచినావు దొరసానీ

ఓరుగాలి చెట్లన్నీ విల్లు వలే ఒంపినట్టు
కనుచూపులు నీవైపుకు లాగినావు దొరసానీ

చిరుజల్లులు చిరుబుడతలు అలికిడేదొ చేసినట్టు
నా గుండెల గజ్జల సడి రేపినావు దొరసాని

ఉషస్సుకే విహంగాలు స్వాగతాలు చెప్పినట్టు
చరవాణికి లేఖలను పంపినావు దొరసానీ

బాపు బొమ్మ ఇష్టపడే వన్నెలయ్య కోరినట్టు
నా కలమున తెలుగు వలే ఆడినావు దొరసానీ #వన్నెలయ్య_గజల్ 55
#గజల్ #గజల్స్ 
#vnlmt వలపు మొక్క* 
విరహవీణ యదలోనా*
వలపులను నాలోనా నాటినావు దొరసానీ
విరహాలను యదలోన మీటినావు దొరసానీ

విరులలోని మరందాలు ప్రియకములే తాగినట్టు
నా మదిలో ప్రేమ వెన్న దోచినావు దొరసానీ

ఓరుగాలి చెట్లన్నీ విల్లు వలే ఒంపినట్టు
కనుచూపులు నీవైపుకు లాగినావు దొరసానీ

చిరుజల్లులు చిరుబుడతలు అలికిడేదొ చేసినట్టు
నా గుండెల గజ్జల సడి రేపినావు దొరసాని

ఉషస్సుకే విహంగాలు స్వాగతాలు చెప్పినట్టు
చరవాణికి లేఖలను పంపినావు దొరసానీ

బాపు బొమ్మ ఇష్టపడే వన్నెలయ్య కోరినట్టు
నా కలమున తెలుగు వలే ఆడినావు దొరసానీ #వన్నెలయ్య_గజల్ 55
#గజల్ #గజల్స్ 
#vnlmt వలపు మొక్క* 
విరహవీణ యదలోనా*