Nojoto: Largest Storytelling Platform

నా కవితల గుండెల్లో నీ రూపం నిలిపాను.! ప్రతి పదమున

నా కవితల గుండెల్లో నీ రూపం నిలిపాను.!
ప్రతి పదమున వెన్నల్లో మాధుర్యం కలిపాను.!

వాడిపోని పుష్పాలకు వనమంతా తిరిగాను
భావ సుమాలారవని నీ పూజకు తెచ్చాను.!

ఆరిపోని దీపాలకు జగమంతా వెతికాను
ఆశాజ్యోతి చెదిరదని నీ ముందర ఉంచాను.!

ఆగిపోని మంత్రాలకు భువనమంత దాటాను
గుసగుసలే ఋక్కులని నీ చెవిలో పలికాను.!

మారిపోని హృదయాలకు వన్నెలంత చూశాను
చివరాకర మనసు రాధని నీ వెంబట పంపాను.! #వన్నెలయ్య_గజల్ 189 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #కృష్ణార్పణం #gazal #వన్నెలయ్య_భక్తి_గజల్