Nojoto: Largest Storytelling Platform

నీ నామం బ్రతుకంతా పలకాలని చిన్ని ఆశ.! నామంతో నీ ధా

నీ నామం బ్రతుకంతా పలకాలని చిన్ని ఆశ.!
నామంతో నీ ధామం చేరాలని చిన్ని ఆశ.!

ప్రపంచాన్ని కౌగిలిలో నింపాలని ఆశ లేదు
నీ రూపం హృదయంలో దాచాలని చిన్ని ఆశ.!

మాడలను మేడలనూ కట్టాలని కలగననూ
ఆ గీతా రత్నాలను పేర్చాలని చిన్ని ఆశ.!

సరదాగా కాలాన్ని గడపాలని అన్నానా.?
అనవరతం స్మరణలోనె ఉండాలని చిన్ని ఆశ.!

సుఖము కొంత క్లేశమెంతో లోకంలో ఓ మీరా..
వన్నెలయ్య కనంతమై వెలగాలని చిన్ని ఆశ.! #వన్నెలయ్య_గజల్ 240 #గజల్ #మీరా #వన్నెలయ్య_భక్తి_గజల్
నీ నామం బ్రతుకంతా పలకాలని చిన్ని ఆశ.!
నామంతో నీ ధామం చేరాలని చిన్ని ఆశ.!

ప్రపంచాన్ని కౌగిలిలో నింపాలని ఆశ లేదు
నీ రూపం హృదయంలో దాచాలని చిన్ని ఆశ.!

మాడలను మేడలనూ కట్టాలని కలగననూ
ఆ గీతా రత్నాలను పేర్చాలని చిన్ని ఆశ.!

సరదాగా కాలాన్ని గడపాలని అన్నానా.?
అనవరతం స్మరణలోనె ఉండాలని చిన్ని ఆశ.!

సుఖము కొంత క్లేశమెంతో లోకంలో ఓ మీరా..
వన్నెలయ్య కనంతమై వెలగాలని చిన్ని ఆశ.! #వన్నెలయ్య_గజల్ 240 #గజల్ #మీరా #వన్నెలయ్య_భక్తి_గజల్