Nojoto: Largest Storytelling Platform

విలువ విహీనపు బరువులు ఎన్నో వాటేసుకుని వెళ్తున్న.!

పరిమళ మొదలి పువ్వుల నెన్నో వెంటేసుకుని వెళ్తున్న.!

లేమిలొ కలిగిన పరవశ సౌఖ్యం కలిమిలో ఎందుకు లేదో?
ఆనందానికి శోక జలదులను కొనేసుకుని వెళ్తున్న.!

ఎంత తీర్చినా కోరిక లారవు ఎంత చూసినా వలపులు ఊడవు
ఆశల నిప్పులు ఎదలో దాస్తూ కాల్చేసుకుని వెళ్తున్న.!

వెన్నెల వదనం బ్రతుకు వెతలలో చలువల పందిరి అనుకున్నా
తెలియక ప్రేమను నింపిన హృదయం పేల్చేసుకుని వెళ్తున్న.!

గుండె ఘోషను దాచక చూపే మనుషులు కొందరె ఈ భువిలో
అక్షరాలలో వన్నెల మనసే రాల్చేసుకుని వెళ్తున్న.! #వన్నెలయ్య_గజల్ 301
#గజల్ #భగ్నప్రేమ