Nojoto: Largest Storytelling Platform

🌱🌹కాణిపాక నాయక🌹🌱🙏 ...........................

🌱🌹కాణిపాక నాయక🌹🌱🙏
........................................
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐 
........................................ 
కాణిపాక నాయకా విన్నపాలు అందుకో
సర్వవిఘ్న నాయకా భావ సుమాలందుకో

వరసిద్ధి నాయక వ్రతమును చేసేము
వక్రతుండనాయక అగ్రపూజలందుకో

శంకర తనయుడ సంకటాలు బాపుమా
ఓంకార రూపుడా వందనాలుఅందుకో

షణ్ముగ సోదరా గుంజిళ్ళుతీసేము
పార్వతి తనయుడా పత్రిపూజలందుకో

ఉండ్రాళ్ళు ఆరగించు దండాలు పెట్టేము
మోదముతో మొక్కేముమోదకాలు అందుకో

ఎలుక వాహనుడా ఏలుకొనరావేమి
గజరాజ రూపుడా గరిక పూజలందుకో

గల్లుగల్లున రావయ్యా గణములనాథుడా
పెరుగుతున్న బాలుడా ప్రమాణాలు అందుకో

చామరకర్ణుడా పామరులను గాచుమా
మూషికా వాహనుడా ముందుపూజలందుకో
 
అసలైనపూజలివి ఆర్భాటము లేనివి
ఆదుకొనరావయ్యా ఆలస్యములెందుకో

కరోనాను తరుమయ్యా కరుణను జూపవయా
లంభోదరా అంబాసుత  లక్ష్మి సేవలందుకో .. మిట్టా లక్ష్మి #గజల్#వినాయక చవితి శుభాకాంక్షలు#శుభోదయం# భావ సుమాలు #వైక్యూ కవి #వైక్యూ తెలుగు#
🌱🌹కాణిపాక నాయక🌹🌱🙏
........................................
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐 
........................................ 
కాణిపాక నాయకా విన్నపాలు అందుకో
సర్వవిఘ్న నాయకా భావ సుమాలందుకో

వరసిద్ధి నాయక వ్రతమును చేసేము
వక్రతుండనాయక అగ్రపూజలందుకో

శంకర తనయుడ సంకటాలు బాపుమా
ఓంకార రూపుడా వందనాలుఅందుకో

షణ్ముగ సోదరా గుంజిళ్ళుతీసేము
పార్వతి తనయుడా పత్రిపూజలందుకో

ఉండ్రాళ్ళు ఆరగించు దండాలు పెట్టేము
మోదముతో మొక్కేముమోదకాలు అందుకో

ఎలుక వాహనుడా ఏలుకొనరావేమి
గజరాజ రూపుడా గరిక పూజలందుకో

గల్లుగల్లున రావయ్యా గణములనాథుడా
పెరుగుతున్న బాలుడా ప్రమాణాలు అందుకో

చామరకర్ణుడా పామరులను గాచుమా
మూషికా వాహనుడా ముందుపూజలందుకో
 
అసలైనపూజలివి ఆర్భాటము లేనివి
ఆదుకొనరావయ్యా ఆలస్యములెందుకో

కరోనాను తరుమయ్యా కరుణను జూపవయా
లంభోదరా అంబాసుత  లక్ష్మి సేవలందుకో .. మిట్టా లక్ష్మి #గజల్#వినాయక చవితి శుభాకాంక్షలు#శుభోదయం# భావ సుమాలు #వైక్యూ కవి #వైక్యూ తెలుగు#

#గజల్#వినాయక చవితి శుభాకాంక్షలు#శుభోదయం# భావ సుమాలు #వైక్యూ కవి #వైక్యూ తెలుగు#