Nojoto: Largest Storytelling Platform

కన్నులను సారించక గెలుపు దూరమయ్యింది.! కన్నీళ్ళను వ

కన్నులను సారించక గెలుపు దూరమయ్యింది.!
కన్నీళ్ళను వారించక మలుపు ఘోరమయ్యింది.!

ఉలికిపాటు, కలవరింత లెన్నిసార్లొ మాధవుడా
కన్నులలో నిద్రలేక నిండ వారమయ్యింది.!

గుండెల్లో నిండి కృష్ణ కన్నులనే శపించావు
కంటి నీరు కురిసి తడిసి చెంప భారమయ్యింది.!

హృదయంలో బాధ పొంగి కంట్లోనే నిండింది
కన్నీటితొ బ్రతుకంతా కడలి తీరమయ్యింది.!

వన్నెలోడి రాధ మనసు నీ కన్నుల కగుపడదా?
కన్నులకే చూపుతుంటె కవిత హారమయ్యింది.! #వన్నెలయ్య_గజల్ 328
కన్నులను సారించక గెలుపు దూరమయ్యింది.!
కన్నీళ్ళను వారించక మలుపు ఘోరమయ్యింది.!

ఉలికిపాటు, కలవరింత లెన్నిసార్లొ మాధవుడా
కన్నులలో నిద్రలేక నిండ వారమయ్యింది.!

గుండెల్లో నిండి కృష్ణ కన్నులనే శపించావు
కంటి నీరు కురిసి తడిసి చెంప భారమయ్యింది.!

హృదయంలో బాధ పొంగి కంట్లోనే నిండింది
కన్నీటితొ బ్రతుకంతా కడలి తీరమయ్యింది.!

వన్నెలోడి రాధ మనసు నీ కన్నుల కగుపడదా?
కన్నులకే చూపుతుంటె కవిత హారమయ్యింది.! #వన్నెలయ్య_గజల్ 328