Nojoto: Largest Storytelling Platform

అమ్మ ప్రేమ అమృతాన్ని తలపించును నా కోసం.! ఎంత చిన్న

అమ్మ ప్రేమ అమృతాన్ని తలపించును నా కోసం.!
ఎంత చిన్న గాయమైన విలపించును నా కోసం.!

తన కడుపును నింపుకోదు ఏ రుచులను కోరుకోదు
ఆ తిరుపతి లడ్డైనా దాచుంచును నా కోసం.!

నాకు కొంత జ్వరమస్తే బాదెక్కువ తనకేగా
కంటి నిండ నిద్రపోదు తపియించును నా కోసం.!

ఏ ఊరికి నేనెళ్ళిన జాగ్రతలు పదే పదే
కొలతలేని ప్రేమంతా చూపించును నా కోసం.!

ఆ వన్నెల కన్నులలో నేనింకా చిన్నవాన్నె
ఈ లోకం మాయలను వివరించును నా కోసం.! #వన్నెలయ్య_గజల్ 290
#వన్నెలయ్య_అమ్మ
#వన్నెలయ్య_స్మృతి
#గజల్
అమ్మ ప్రేమ అమృతాన్ని తలపించును నా కోసం.!
ఎంత చిన్న గాయమైన విలపించును నా కోసం.!

తన కడుపును నింపుకోదు ఏ రుచులను కోరుకోదు
ఆ తిరుపతి లడ్డైనా దాచుంచును నా కోసం.!

నాకు కొంత జ్వరమస్తే బాదెక్కువ తనకేగా
కంటి నిండ నిద్రపోదు తపియించును నా కోసం.!

ఏ ఊరికి నేనెళ్ళిన జాగ్రతలు పదే పదే
కొలతలేని ప్రేమంతా చూపించును నా కోసం.!

ఆ వన్నెల కన్నులలో నేనింకా చిన్నవాన్నె
ఈ లోకం మాయలను వివరించును నా కోసం.! #వన్నెలయ్య_గజల్ 290
#వన్నెలయ్య_అమ్మ
#వన్నెలయ్య_స్మృతి
#గజల్