Nojoto: Largest Storytelling Platform

White చిన్న దూరం ఒకోసారి సుదూరమవుతుంది చిన్న గాయం

White చిన్న దూరం ఒకోసారి సుదూరమవుతుంది 
చిన్న గాయం ఒకోసారి భయంకరంగా బాధ పెడుతుంది 
క్షణకాలం ఏర్పడిన శూన్యం ఒకోసారి మనోధైర్యాన్ని చంపేస్తుంది 
మనసుల మధ్య నిశ్శబ్దమంటే 
మనుషుల మధ్య యుద్ధం లాంటిది 
అది ఎవరినీ చంపకపోయినా తీవ్రంగా గాయపరుస్తూనే ఉంటుంది 
శాంతి కలిగినా మచ్చ మిగులుతుంది 
వేలి కోసల నుంచి జారే అతి చిన్న స్పర్శ ఒకోసారి అద్భుతాల్ని చేస్తుంది 
ఈ దూరాన్ని చెరిపేసే క్రమంలో కాలం కన్నీళ్లను సైతం భరిస్తుంది 
అయినా మనసుల మధ్య దూరాన్ని పూడ్చాలంటే 
ఎన్ని యుద్ధాలని చేసి 
ఎన్ని మనసుల్ని పూడ్చిపెట్టాలో కదా 
మరణించిన ఆత్మల మీదుగానే కొత్త సేతువు నిర్మించబడుతుంది అప్పుడప్పుడు

©gopi kiran
  #sad_shayari
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon449

#sad_shayari

135 Views