Nojoto: Largest Storytelling Platform

వెలుతురికై వెతుకులాట చీకటిలో చేస్తావా? నీ ఆశయమేమిట

వెలుతురికై వెతుకులాట చీకటిలో చేస్తావా?
నీ ఆశయమేమిటంటూ పరులనడిగి చూస్తావా?
పక్షిలాగ ఎగరాలని ఏనుగు కృషిచేస్తుందా?
పరుల ఆశయాలతో నీ మది సంతోషిస్తుందా?
(పరుల) బానిసవై బతుకుతావ? సంకెళ్ళను తెంచుకోవా?

ఒక్కడైనా తోడులేడని నీ దారిని వదిలేస్తావా?
లక్షమంది వెల్తుంటే లక్ష్యాన్నే మార్చేస్తావా?
కోటి మంది కలిసి చెప్తే అబద్దం రుచిస్తుందా?
ఏవొక్కడు పలుకకున్నా నిజం నిలువకుంటుందా?
(భయానికి) బానిసవై బతుకుతావ? సంకెళ్ళను తెంచుకోవా?

దేనికోసమింత పరుగని ఒక్కసారి మనసునడుగు
దాగి ఉన్న కలలెన్నో! మరిచిపోయినవికెన్నో?!
కలలనన్ని కరుగబెట్టి సాగరాన్ని చేస్తావా? ఆ సంద్రంలో చస్తావా?
(కాలపు) బానిసవై బతుకుతావ? సంకెళ్ళను తెంచుకోవా?  #telugu #telugupoem #kavita #teluguvelugu #yqkavi

#Amaterasutelugu

amaterasu9739

amaterasu

New Creator