Nojoto: Largest Storytelling Platform

పోరులోన తత్వ గీత వ్రాసినావు జ్ఞాననాథ.! వనములోన అలమ

పోరులోన తత్వ గీత వ్రాసినావు జ్ఞాననాథ.!
వనములోన అలమంద కాసినావు లోకనాథ.!

వెంటుంటే ఆకలంత తీర్చినావు! అమ్మవా?
చోరుడవై వెన్నలెన్నొ పంచినావు జగన్నాథ

ఆపదలో ఆశ్రయిస్తె, నీ కరుణను ఎంతనను?
దండి కొండ వేలు పైన మోసినావు ధీననాథ.!

హృదయాలను చూసే నీ చూపులను ఏమనాలి?
ముత్యమంత పత్రానికి తూగినావు రమానాథ.!

వన్నెల్'కే' వెళ్ళొద్దని యశోదమ్మ కట్టిందా?
నా ముందుకు రావడమే మరచినావు ప్రాణనాథ.! #వన్నెలయ్య_గజల్ 192 #గజల్ #గజల్స్ #తెలుగుగజల్ #కృష్ణార్పణం #వన్నెలయ్య_భక్తి_గజల్