Nojoto: Largest Storytelling Platform

భయమంతా వీడిపోని శరణార్థుల గుండెలలో.!! అభయమంత నిండు

భయమంతా వీడిపోని శరణార్థుల గుండెలలో.!!
అభయమంత నిండుకోని కరుణార్ధ్రుల  తలపులలో.!!

శోకమిడిచి హృదయమెంతొ ఉయ్యాలలు ఊగుతుంది..
కల్లకపట మెరుగలేని చిన్నారుల లోకంలో.!!

ఆశలింక మోయలేక ప్రాణమంత కరుగుతుంది..
కడుపునిండ తిండి లేని అన్నార్తుల బ్రతుకుల్లో.!!

ఇనుపెట్టె కతుక్కునీ మనిషి గుండె రాతిదాయె..
మానవతా జాడలేదు ధనవంతుల కర్మలలో.!!

విజయ చేయి పట్టినపుడె వెలుగ నీకు వన్నెలయ్య..
కళలెన్నో ఇలకొంగును స్త్రీమూర్తుల చేతలలో.!! #వన్నెలయ్య_గజల్ 170 #విభీషణుడు #గజల్ #తెలుగుగజల్  #గజల్స్ #వన్నెలయ్య_బాపు
Pic source: #బాపు