Nojoto: Largest Storytelling Platform

సమరాలను జరపాలని దేశాలకు ఆరాటం తిమిరాలను తరమాలని దీ

సమరాలను జరపాలని దేశాలకు ఆరాటం
తిమిరాలను తరమాలని దీపాలకు ఆరాటం

ఈలవేసి పాడుతూనె గోల చేసి ఆడుతుంది
చలచల్లగ తాకాలని పవనాలకు ఆరాటం

రాలుతున్న తమదేహం వాడుతున్న తమ ప్రాణం
పరిమళాలు పంచాలని కుసుమాలకు ఆరాటం

సమస్తాన్ని మరిపించే వనములోని రాసక్రీడ
కృష్ణ పెదవి తాకాలని గోపికలకు ఆరాటం

వన్నెలయ్య అక్షరాలే సుప్రభాత కాంతులయ్యె
భ్రాంతులనే తరమాలని కవనాలకు ఆరాటం #వన్నెలయ్య_గజల్ 127
#గజల్ #గజల్స్ #ఆరాటం #gazal #gazallover 
మత్లా మొదటి పాదం మొన్నటి వరకు కొనసాగిన ఇస్రాయెల్, పాలస్తీనా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులను, వాటిని ప్రోత్సాహించిన దేశాలను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను.

ఐనా శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు కదా
"ఏ దేశ చరిత్ర చూసిన
ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం
సమరాలను జరపాలని దేశాలకు ఆరాటం
తిమిరాలను తరమాలని దీపాలకు ఆరాటం

ఈలవేసి పాడుతూనె గోల చేసి ఆడుతుంది
చలచల్లగ తాకాలని పవనాలకు ఆరాటం

రాలుతున్న తమదేహం వాడుతున్న తమ ప్రాణం
పరిమళాలు పంచాలని కుసుమాలకు ఆరాటం

సమస్తాన్ని మరిపించే వనములోని రాసక్రీడ
కృష్ణ పెదవి తాకాలని గోపికలకు ఆరాటం

వన్నెలయ్య అక్షరాలే సుప్రభాత కాంతులయ్యె
భ్రాంతులనే తరమాలని కవనాలకు ఆరాటం #వన్నెలయ్య_గజల్ 127
#గజల్ #గజల్స్ #ఆరాటం #gazal #gazallover 
మత్లా మొదటి పాదం మొన్నటి వరకు కొనసాగిన ఇస్రాయెల్, పాలస్తీనా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులను, వాటిని ప్రోత్సాహించిన దేశాలను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను.

ఐనా శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు కదా
"ఏ దేశ చరిత్ర చూసిన
ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం