Nojoto: Largest Storytelling Platform

" జీవితం" ముక్కంటి ఆడే మూడు ముక్కలాట అనుకూలం అనుకో

" జీవితం"
ముక్కంటి ఆడే మూడు ముక్కలాట
అనుకూలం అనుకోని ఆనందపడేలోపే
తీరుమార్చి తికమక పెడతాడు

బంధాలను విడిచి బ్రతుకు బాటని పట్టించి 
బోర్లా పడేసి చిత్రం చూస్తాడు
ఆనందాల ద్వారం అతి చేరువలోనుంచి
కాలు కదలనీక సంకెళ్ళు వేస్తాడు

అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి
అనుభవించ ఆరోగ్యం ఇవ్వనంటాడు
ఉసురు తీసుకుపో అనే వేదనకు 
 ధీర్ఘాయురస్తూ అంటూ దీవెనలిస్తాడు

 నీవెంట రానివి నీవంటూ భ్రమపెడతాడు
నీలో నిద్రిస్తున్న తనను మనోనేత్రంతో చూడమంటాడు

©vineelasubramanyam #Life #God #Truth #experience 
#cards
" జీవితం"
ముక్కంటి ఆడే మూడు ముక్కలాట
అనుకూలం అనుకోని ఆనందపడేలోపే
తీరుమార్చి తికమక పెడతాడు

బంధాలను విడిచి బ్రతుకు బాటని పట్టించి 
బోర్లా పడేసి చిత్రం చూస్తాడు
ఆనందాల ద్వారం అతి చేరువలోనుంచి
కాలు కదలనీక సంకెళ్ళు వేస్తాడు

అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి
అనుభవించ ఆరోగ్యం ఇవ్వనంటాడు
ఉసురు తీసుకుపో అనే వేదనకు 
 ధీర్ఘాయురస్తూ అంటూ దీవెనలిస్తాడు

 నీవెంట రానివి నీవంటూ భ్రమపెడతాడు
నీలో నిద్రిస్తున్న తనను మనోనేత్రంతో చూడమంటాడు

©vineelasubramanyam #Life #God #Truth #experience 
#cards

Life God Truth experience cards