Nojoto: Largest Storytelling Platform

కొలిచి కొలిచి జగతిలోనే అలసిపోతాను.! ప్రేమ గాలితొ న

కొలిచి కొలిచి జగతిలోనే అలసిపోతాను.!
ప్రేమ గాలితొ నిన్ను కదిపీ గెలిచిపోతాను.!

ముళ్ళు ఎన్నో చుట్టు ఉన్నా బాధ నాకేలా
చరణు చేరి పువ్వుగానే మిగిలిపోతాను.!

అనంతాన్నీ పొందగోరి ఆగిపోతానా?
యముననై నే పరుగు పరుగున  నడిచిపోతాను.!

పెదవి తాకిన వేణువిదిగో నాకు దొరికింది
ఊది, నీవే తాకినట్టు మురిసిపోతాను.!

నిండు వెన్నెల నింపుకున్నది వన్నెల్ ఇప్పుడు
కవిత కవితలొ నీ కొరకే మెరిసిపోతాను.! #వన్నెలయ్య_గజల్ 326 #గజల్